యువత భవిత కోసమే యువగళం పాదయాత్ర
24-2-2023 *యువత భవిత కోసమే యువగళం పాదయాత్ర!* *రాష్ట్రాన్ని తిరిగి నెం.1గా మార్చేవరకు విశ్రమించను!* *మూడున్నరేళ్లుగా అరాచకపాలనలో రాష్ట్రం సర్వనాశనం* *పేదరికంలేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే టిడిపి లక్ష్యం* *హలో లోకేష్ కార్యక్రమంలో సూటిగా జవాబిలిచ్చిన యువనేత* *తిరుపతి అంకుర హాస్పటల్ సమీపాన ప్రాంగణంలో హాలో లోకేష్ పేరుతో యువతీయువకులతో ఉత్సాహంగా సాగిన ముఖాముఖి సమావేశం.* • తిరుపతి నగరంతోపాటు జిల్లానలుమూలల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన యువకులు. • యువతీయువకుల కేరింతలతో మారుమోగిన సమావేశ ప్రాంగణం. • యువకులు అడిగిన ప్రతిప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చిన యువనేత లోకేష్. • ఒక యువకుడిగా సమాజంలో మార్పునకు ప్రయత్నిస్తున్నా. • టిడిపి హయాంలో ఐటీ మంత్రిగా చిత్తూరు జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తెచ్చా. • యువత భవిష్యత్ కోసమే యువగళం పాదయాత్ర చేపట్టా. • జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది. • వైసిపి పాలనలో ఏపీకి ఒక్క పరిశ్రమ రాలేదు, ఉన్నవి కూడా పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నాయి. • అరాచకపాలనలో అధఃపాతాళానికి చేరిన ఏపీని తిరిగి అగ్రగామిగా నిలబెట్టేందుకు పాలనలో సమూల మార్పులు తీసుకొస్తాం. • టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్పు మొదలవుతుంది. • *రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఉద్యోగం ఇచ్చి జగన్కు రిటర్న్ గిఫ్టు ఇస్తా.* • చంద్రబాబు హయాంలో అన్ని జిల్లాలకు సమప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేశారు. • పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని నిలపడమే టిడిపి లక్ష్యం. • ఇప్పటివరకు 350 కిలోమీటర్లు ప్రజల కోసం నడిచాను.. ప్రజల ఆశీర్వాదంతో 4 వేల కిలోమీటర్లు విజయవంతంగా నడుస్తా. • టిడిపి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాయని యువత చెబుతున్నారు. తిరిగి అధికారం చేపట్టాక వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. *ఐఐఎం ప్రొఫెసర్ రాజేష్ వ్యాఖ్యాతగా ఆసక్తికరంగా సాగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో లోకేష్ సమాధానాలు:* ప్రశ్న: మీరు చాలా విలాసవంతమైన జీవితాన్ని ఎందుకు వదులుకుని కష్టపడుతున్నారు? యువగళం ఎందుకు ప్రారంభించారు? లోకేష్: రాష్ట్రం జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో మగ్గిపోతోంది. యువత భవిష్యత్తు నాశనం అవుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు లేవు. రాష్ట్రం అన్ని రంగాల్లో అట్టడుగు స్థాయికి వెళ్లిపోయింది. రాష్ట్రాన్ని మళ్లీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే ఈ యువగళం ప్రారంభించాను. ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన విద్యార్థులంతా వెనక్కి తిరిగి రండి. ఇది మన రాష్ట్రం. మనమంతా కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రశ్న: మీరు బాగా ఉన్నత కుటుంబం నుండి వచ్చారు. బడుగు,బలహీనవర్గాల గురించి అవగాహన లేదని కొంత మంది విమర్శిస్తున్నారు. దానికి మీరేం చెబుతారు? లోకేష్: మా తాత ఏపీ కి పూర్వపు సీఎం, మా నాన్న ఏపీకి సుదీర్ఘకాలం సీఎం. సమాజంలో మార్పును ఏమైతే మనం ఆశిస్తున్నామో దాన్ని ఒక యువకుడిగా తీసుకురావాలని నేను సంకల్పించాను. నన్ను వైసీపీ వాళ్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయినా నేను పట్టించుకోలేదు. నా లక్ష్యం రాష్ట్రాభివృద్ధి మాత్రమే. మా కుటుంబం భోజన సమయంలో కూడా రాష్ట్ర సమస్యలపై చర్చిస్తాం. నేడు పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యల్ని దగ్గరుండి తెలుసుకునే అవకాశాన్ని తీసుకున్నాను. అన్ని సమస్యల్ని తెలసుకుంటున్నాను. పరదాల చాటున దాక్కున్న సీఎం కంటే ఎక్కువ అవగాహన నాకు ఉంది. ప్రశ్న: యువతకు మీరు ఏం చేశారని మీ వైపుకు వస్తారు? లోకేష్: చిత్తూరు జిల్లా యువతకు ఐటీ,ఎలక్ట్రానికి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జోహో, సెలకాన్, ఫాక్స్కాన్, టీసీఎల్ తెచ్చాం. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కూడా అందించాం. నేను జగన్ రెడ్డి నేను తెచ్చిన కంపెనీల వద్ద సెల్ఫీ తీసుకుని ఛాలెంజ్ విసిరాను. దాన్ని స్వీకరించే పరిస్థితి లేకుండా పోయింది. యువతను పార్టీలో పెద్దఎత్తున ప్రోత్సహించింది టీడీపీ. అందుకే నాకు 100శాతం యువతతో కలిసి నడవడానికి, వాళ్లు నాతో రావడానికి అవకాశం ఉంది. ప్రశ్న: 350కిలోమీటర్లు(9శాతం) పాదయాత్ర పూర్తయ్యింది. ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. అడ్డంకులు ఏవిధంగా ఎదుర్కొంటూ మిగతా యాత్రను పూర్తిచేస్తారు? లోకేష్: తగ్గేదే లే....ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టుకోమనండి. సహకరిస్తే ఇది పాదయాత్ర...లేకుంటే దండయాత్రే...అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం. ఇది యువత కోసం చేస్తున్న పాదయాత్ర. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా యువత కోసం లోకేష్ అనే వ్యక్తి ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదు. అడ్డంకులను అధిగమిస్తాం..యువత కోసం పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేస్తాం. ప్రశ్న: ఇప్పటి వరకు పూర్తయిన 350కిలోమీటర్ల పాదయాత్రలో మీకు ఆనందం కలిగించిన అంశాలేంటి? లోకేష్: రాష్ట్ర ప్రజలు నిజమైన అభివృద్దిని కాదనుకుని మోసం చేసే ప్రభుత్వాన్ని ఎందుకు అధికారంలోకి తెచ్చుకున్నారోనని బాధపడుతూ ఉండేవాడిని. కానీ మన ప్రభుత్వంలో మనం తెచ్చిన కంపెనీలను చూస్తున్నప్పుడు, అందులో ఉద్యోగులు నాతో తమ సంతోషాన్ని పంచుకున్నప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది. నా బాధ మొత్తాన్ని మరిచిపోయాను. నా ఉత్సాహం ఆ కంపెనీలను చూశాక రెట్టింపయ్యింది. ప్రశ్న: మీ పాదయాత్రలో మీ దృష్టికి వచ్చిన సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు? మీ విజన్ ఏంటి? లోకేష్: నా ఉద్దేశం, టీడీపీ ఉద్దేశం ఒక్కటే. ఇంకా ఎన్నాళ్లు మనం ఇబ్బందులు పడాలి? పక్క రాష్ట్రాలకు పొట్టకూటికోసం ఎందుకు వలస వెళ్లాలి? మన రాష్ట్రంలో మనం బ్రతకలేమా? ఇతర రాష్ట్రాల వాళ్లు మన రాష్ట్రానికి వలసలు వచ్చేలా చేయాలి, అన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలన్నదే మా లక్ష్యం. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ రావాలనేదే మా ఉద్దేశం. అన్ని రంగాల్లో ఏపీని అగ్రస్థానంలోకి తీసుకురావడమే నా అంతిమ లక్ష్యం. హైదరాబాద్ మాత్రమే కాదు...ప్రతి జిల్లాలో హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళతాం. అదే పార్టీ అజెండా..ఈ లోకేష్ అజెండా . రాము, శ్రీశైలం: జగన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఏం ఇస్తారు అన్నా? లోకేష్: ఏపీలోని యువత మొత్తానికి ఉద్యోగాలిచ్చి దాన్ని రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. 2019లో యువతకు జగన్ హామీలిచ్చి తప్పిన వాటిని మేం నెరవేరుస్తాం. మ
https://yuvagalam.com/