త్వరలో జనసేనలోకి చిత్తూరు MLA. BSR NEWS

త్వరలో జనసేనలోకి చిత్తూరు MLA
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరడం దాదాపు ఖాయమైంది. ఆ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్తో కలిసి ఆయన హైదరాబాద్ వెళ్లి పవన్ కళ్యాణ్ను కలిశారు. పార్టీలో చేరికలపై చర్చించినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఆయన జనసేన కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. బలిజ ఎమ్మెల్యే తమ పార్టీలో చేరడంతో జనసేనకు మరింత బలం చేకూరుతుందని కిరణ్ రాయల్ పేర్కొన్నారు.