చిత్తూర్పట్టణంలోదొంగతనానికిపాల్పడినతమిళనాడురాష్ట్రా నికిచెందిన అంతరాష్ట్రదొంగఅరెస్టు-అతనివద్ద నుండి దొంగిలించబడిన సుమారు రూ.8,00,000/- విలువ కలిగిన 130 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం. BSR NEWS

చిత్తూర్పట్టణంలోదొంగతనానికిపాల్పడినతమిళనాడురాష్ట్రా నికిచెందిన అంతరాష్ట్రదొంగఅరెస్టు-అతనివద్ద నుండి దొంగిలించబడిన సుమారు రూ.8,00,000/- విలువ కలిగిన 130 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం. BSR NEWS

చిత్తూర్ పట్టణం లో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన అంతరాష్ట్ర దొంగ అరెస్టు- అతని వద్ద నుండి దొంగిలించబడిన సుమారు రూ. 8,00,000/- విలువ కలిగిన 130 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం.

ఇటివల చిత్తూరు పట్టణంలో, చిత్తూరు 1 టౌన్ మరియు చిత్తూర్ 2 టౌన్ పరిదిలో గల 05 వేరు వేరు ప్రదేశాలలో తాళం వేసివున్న ఇంటి తలుపులు పగలగొట్టి బంగారు నగలు దొంగలించిన సంఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడినది. సదరు దొంగతనం కేసులను చిత్తూర్ జిల్లా ఎస్.పి. శ్రీ వి.ఎన్. మనికంఠ చందోలు ఐ. పి. ఎస్. గారి పర్యవేక్షణలో, చిత్తూర్ డి. ఎస్. పి. శ్రీ సాయి నాద్ గారి అధ్వర్యంలో, చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. జయరామయ్య గారు మరియు చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ డి. నెట్టికంటయ్య గారు మరియు చిత్తూరు 1 టౌన్ మరియు 2 టౌన్ స్టేషన్ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి ఆంద్ర ప్రదేశ్ మరియు తమిళ్ నాడు రాష్ట్రాల ప్రాంతాలలో ముమ్మర దర్యాప్తు చేసి తమిళనాడు, గుడియాత్తంకు చెందిన మహమ్మద్ బిలాల్ అను వ్యక్తిని ఈ రోజు 24.09.2024 కాట్పాడి వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి దొంగలించబడిన సుమారు రూ. 8,00,000/- విలువ కలిగిన 130 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం. దర్యాప్తులో సదరు దొంగ తాళం వేసివున్న ఇళ్ళను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిసినది. చిత్తూరు 1 టౌన్ పరిదిలో 03 కేసులు మరియు చిత్తూర్ 2 టౌన్ పరిదిలో 02 కేసుల నందు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.అరెస్టు కాబడిన అంతరాష్ట్ర దొంగ వివరాలు :A. Mohammed Bilal @ Prabhu, Age 32 Yrs, S/o Adityan, New Street, Valattur Village, Gudiyatam Taluka, Vellore Dist. TNపై దర్యాప్తులో పాల్గొన్న ఆఫీసర్స్ మరియు ID పార్టీ సిబ్బందిని చిత్తూర్ జిల్లా ఎస్.పి. శ్రీ వి.ఎన్. మనికంఠ చందోలు, IPS మరియు చిత్తూర్ డి. ఎస్. పి. శ్రీ శ్రీ సాయి నాద్ గారు ప్రత్యకం గా అభినందించారు.