ఐరాల: దళితుల భూములను రక్షించండి BSR NESW

ఐరాల: దళితుల భూములను రక్షించండి
దళితులకు సంబంధించిన పేడ దిబ్బలను, భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకొని దళితులకు న్యాయం చేయాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు డిమాండ్ చేశారు. ఐరాల మండలం, గాజుల పల్లె దళితవాడ గ్రామస్తులు, చిత్తూరు ఆర్డీవోకి వినతి పత్రం అందజేశారు. అక్రమాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకొని దళితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.