ఐరాల: టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి నిరసన BSR NESW

ఐరాల: టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి నిరసన ఐరాల మండల కేంద్రం సమీపంలోని ఆర్ అండ్ బి రోడ్డుపై టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి నిరసన కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని మాజీ మండల టీడీపీ అధ్యక్షులు జయచంద్రయ్య , మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పురుషోత్తం తెలిపారు. జిల్లా నాయకులు అభిమాన సంఘాల అధ్యక్షులు పూల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.