Notices | అంగన్‌వాడీలకు ఏపీ ప్రభుత్వం నోటీసులు.. విధులకు హాజరు కాకుంటే చర్యలంటూ హెచ్చరికలు

Notices | అంగన్‌వాడీలకు ఏపీ ప్రభుత్వం నోటీసులు.. విధులకు హాజరు కాకుంటే చర్యలంటూ హెచ్చరికలు

Notices | అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు(Anganwadis Strike) చేపట్టిన సమ్మె మంగళవారం 22వ రోజుకు చేరుకుంది.

అమరావతి : అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు (Anganwadis Strike) చేపట్టిన సమ్మె మంగళవారం 22వ రోజుకు చేరుకుంది. వేతనాల పెంపుతో పాటు గ్యాట్యుటీ సహా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని విధులను బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపినా పరిష్కారం కాకపోవడంతో అంగన్‌వాడీలు సమ్మెను ఉదృతం చేశాయి.

ఈ సమ్మె వల్ల గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు పోషక ఆహారం లభించక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ దశలో మంగళవారం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 5 వ తేదీలోగా విధులకు హాజరు కాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది . సమ్మె కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వారికి ఇప్పటికే పూర్తి చేసిన హామీలను వివరిస్తూ ప్రభుత్వం నోట్ జారీ చేసింది.