Kerala High Court : జడ్జీలు దేవుళ్లు కాదు.. వాళ్లెదుట చేతులు కట్టుకోవాల్సినవసరం లేదు : కేరళ హైకోర్టు

Kerala High Court : జడ్జీలు దేవుళ్లు కాదు.. వాళ్లెదుట చేతులు కట్టుకోవాల్సినవసరం లేదు : కేరళ హైకోర్టు

ఇంటి దగ్గర ఉన్న ప్రార్థనా మందిరం మైక్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లు 2019లో ఒక మహిళ అలప్పుజ్జా ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలననను అలప్పుజ్జా ఎస్ఐ నిర్లక్ష్యం చేశారు. దీంతో ఆమె తిరిగి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు దేవుళ్లు కారని న్యాయవాదులు, కక్షిదారులు వారి ముందు చేతులు కట్టుకొని ఒదిగి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ కున్హి కృష్ణ ఈ విషయాన్ని పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తన ఇంటి దగ్గర ఉన్న ప్రార్థనా మందిరం మైక్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లు
2019లో ఒక మహిళ అలప్పుజ్జా ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలననను అలప్పుజ్జా ఎస్ఐ నిర్లక్ష్యం చేశారు. దీంతో ఆమె తిరిగి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కక్ష పెంచుకున్న ఎస్ఐ.. ఆమె తనను ఫోన్ లో దూషించారంటూ కేసు పెట్టారు.

తన కేసును పరిశీలించాలంటూ ఆమె చేతులు జోడించి కన్నీళ్లతో న్యాయమూర్తిని అర్థించడంతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు దేవుళ్లు కారని.. న్యాయవాదులు, కక్షిదారులు వారి ముందు చేతులు కట్టుకొని ఒదిగి ఉండాల్సిన పని లేదని స్పష్టం చేశారు.