Srisailam | ఆదివారం నుంచి శ్రీశైలంలో దసరా నవరాత్రులు షురూ..!

Srisailam | ఆదివారం నుంచి శ్రీశైలంలో దసరా నవరాత్రులు షురూ..!

Srisailam | శ్రీశైలం దసరా మహోత్సవాలు ఆదివారం ప్రారంభం అవుతాయి. ఈవో పెద్దిరాజు దంపతులు ఆదివారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ప్రధాన గోపురం నుండి ఆలయ ప్రవేశం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భూ మండలానికి నాభి స్థానం శ్రీశైల మహా క్షేత్రంలో ఆదివారం నుండి దసరా శరన్నవరాత్రుల వేడుకలు శాస్ర్తోకంగా ప్రారంభం కానున్నాయి. శ్రీశైల ప్రధానాలయంతోపాటు ఉప ఆలయాలు, ప్రాకారానికి చేసిన విద్యుత్‌ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగి పోతున్నాయి. ఆలయ ఈఓ పెద్దిరాజు దంపతులు అర్చక వేదపండితులతో కలిసి ఆదివారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ప్రధాన గోపురం నుండి ఆలయ ప్రవేశం చేస్తారు. గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, దీక్ష సంకల్పం, కంకణ పూజ, ఋత్విక గ్వరణం, అమ్మవారి యాగశాల ప్రవేశం, అఖండదీపస్థాపన, మండపారాధన తదితర పూజా కార్యక్రమాలు చేస్తారని అధికారులు తెలిపారు.