BSR NEWS

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చౌడేపల్లి మండలం మడుకూరు మలుపు వద్ద రోడ్డు
ప్రమాదం చోటుచేసుకుంది. చౌడేపల్లికి చెందిన యువకుడు శ్రీనివాస్ (16) బైకులో వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందారు. శ్రీనివాస్ వాలీబాల్ ఆడటానికి పరిగిదొన వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.