BSR NEWS

BSR NEWS

ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆదేశాల మేరకు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ తులసీ ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా, పూతలపట్టు నియోజకవర్గం, పూతలపట్టు మండల అధ్యక్షులు శ్రీ బండారు మనోహర్ గారి ఆధ్వర్యంలో పూతలపట్టు మండల జనసేన పక్షం యొక్క సమావేశం సుమారు 50 మందితో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల కార్యవర్గం ఎంపిక మరియు పూతలపట్టు మండలంలో జనసేన పక్షం బలోపేతం చేయడానికి అనుసరించవలసిన వ్యూహాలు చర్చించడం జరిగింది. 

అలాగే అతి త్వరలో జరుగనున్న నియోజకవర్గ స్థాయి సమావేశానికి సుమారు 500 మంది పూతలపట్టు మండలం నుంచి హాజరు కావాలని, అందుకోసం చేయవలసిన ఏర్పాట్లు కూడా చర్చించడం జరిగింది. 

ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి జనసైనికుడికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము...

ఇట్లు,

పూతలపట్టు మండల కార్యవర్గం..