Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీవో?

BSR NEWS
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన కడప ఆర్డీవో మధుసూదన్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓఎస్డీగా ప్రమాషన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనను పవన్ కల్యాణ్ ఓఎస్డీగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంను మధుసూదన్ ఇటీవల కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.