Lavu Sri Krishna Devarayalu: క్లారిటీ ఇచ్చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు లేఖ

BSR NEWS
- నియోజకవర్గ ప్రజలకు లేఖ రాసిన ఎంపీ
- నరసరావుపేట ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమానాలు మరువలేనివని వ్యాఖ్య
- నియోజకవర్గ అభివృద్దికి మరోమారు గెలిపించాలని విజ్ఞప్తి
లోక్‌సభ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల్లో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా, తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు కీలక ప్రకటన చేశారు. తాను త్వరలోనే చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు.
ప్రజలు తనపై చూపిన ప్రేమ, అభిమానం మరువలేనివని ఆ లేఖలో పేర్కొన్నారు. పల్నాడు అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేస్తున్నట్టు చెప్పారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ మీ ముందుకు వస్తానని, మరోమారు అవకాశం ఇస్తే అభివృద్ధిలో నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని లేఖలో పేర్కొన్నారు.