Vijay Deverakonda – Rashmika : నువ్వు చెప్పు.. నీకోసం వాళ్ళని పిలుస్తా.. రష్మిక కోసం విజయ్ దేవరకొండ ఆఫర్..

BSR NEWS
రౌడీ కల్చర్ లో విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఈ అలయ్ బలయ్ సాంగ్ వైరల్ అవుతుంది. ఈ వీడియోని రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి..
Vijay Deverakonda – Rashmika : విజయ్ దేవరకొండ ఓ పక్క సినిమాలతో పాటు మరో పక్క బిజినెస్ లు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. అతని బిజినెస్ లలో రౌడీ క్లబ్ పేరుతో బట్టల బిజినెస్ ఒకటి. రౌడీ కల్చర్ అంటూ ఇటీవల దీన్ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు విజయ్. తాజాగా సింగర్ రామ్ మిరియాల గతంలో పాడిన అలయ్ బలయ్.. సాంగ్ ని తన రౌడీ కల్చర్ కోసం రౌడీ క్లబ్ డ్రెస్ లలో మరోసారి పాడించి ప్రమోట్ చేస్తున్నాడు.
దీంతో రౌడీ కల్చర్ లో విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఈ అలయ్ బలయ్ సాంగ్ వైరల్ అవుతుంది. ఈ వీడియోని రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.. ఇది చాలా బాగుంది. నీకు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి విజయ్. నీ ప్లేలిస్ట్ నేను ఎప్పట్నుంచో అడుగుతున్నాను. ఇప్పుడు ప్రపంచం కూడా నీ ప్లే లిస్ట్ చూడాలనుకుంటుంది. ఈ సాంగ్ వైబ్ చాలా బాగుంది. నేను నా ఫేవరేట్ సింగర్స్ లిస్ట్ ఇవ్వనా, ప్లీజ్.. రామ్ మిరియాల నువ్ చాలా అద్భుతంగా పాడావు అని రాసుకొచ్చింది.