Pushpa 2 : పుష్ప 2 మొదటి పాట రాబోతోందా.. ఈసారి ప్రమోషన్స్‌లో తగ్గేదేలే..

BSR NEWS
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ రెడీ చేస్తున్న పుష్ప 2 మూవీ టీం. సినిమా నుంచి మొదటి పాటని..
Pushpa 2 : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ కోసం పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక టీజర్ అండ్ పోస్టర్ తప్ప మరో కొత్త అప్డేట్ రాలేదు. ఆగష్టులో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయినా వస్తే బాగుండని ఫ్యాన్స్ అంతా ఆశ పడుతున్నారు. తాజాగా మూవీ టీం కూడా ఆ క్రేజీ అప్డేట్ ఇవ్వడానికి సిద్దమయ్యినట్లు సమాచారం.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది బర్త్ డేకి టీజర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసిన మూవీ టీం.. ఈసారి సాంగ్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారట. పుష్ప 1కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ఎంత పెద్ద హిట్టు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో సెకండ్ పార్ట్ మ్యూజిక్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ కూడా అందుకు తగ్గట్లు మ్యూజిక్ ట్రాక్స్ ని సిద్ధం చేసినట్లు సమాచారం.