ఎల్-నినో ఏర్పడే అవకాశాలు ఈ ఏడాది కనిపిస్తోంది కాబట్టి రానున్న మూడు నెలల్లో ఎండల వేడి భాగా ఎక్కువ ఉండనుంది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లా-నినా ఇప్పుడు భాగా బలహీనపడింది. దీని ప్రభావం మరి కొన్ని రోజుల్లో తెరపడనుంది. మార్చి నుంచి మే నెలలో ఎప్పుడు మనకు ఎండలు భాగానే కాస్తుంది.
కానీ గత మూడు సంవత్సరాలుగా సాధారణం కంటే తక్కువగానే ఎండలు ఉంది. చాలా మంది ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంది అని అన్నారు, కానీ ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన కాదు. ఇది పసిఫిక్ లో ఏర్పడిన లా-నినా ప్రభావం. కాబట్టి రానున్న రోజుల్లో లానినా ఉండదు కాబట్టి. ఎండలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంది.
2003, 2009, 2012, 2015, 2018 సంవత్సరాల్లో ఎల్-నినో ఏర్పడే తరుణంలో ఎండలు సాధారణం కంటే ఎక్కువగానే ఉంది. దీనికి తోడు మే నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు బర్మా లేదా బంగ్లాదేశ్ వైపుగా వెళ్లడం జరిగితే వడగాల్పులు ఉండటం సాధారణం. మరి ఈ సారి ఎలా ఉండనుందో చూడాలి.
FOLLOW Us on Instagram at - www.instagram.com/andhrapradeshweatherman