తారకరత్న మరణానికి కారణం ఇదేనా.....!!

తారకరత్న మరణానికి కారణం ఇదే
తారకరత్న గుండెపోటుకు గురైన సమయంలో మెదడులో దాదాపు 45 నిమిషాలు రక్త ప్రసరణ ఆగిపోయిందని, కొంత భాగం దెబ్బతిందని వైద్యులు గుర్తించారు. మెదడులో నీరు చేరినట్లు కూడా తెలిపారు. చికిత్స అనంతరం గుండె, కాలేయ పని తీరు మెరుగుపడినప్పటికీ మెదడు దెబ్బతినడంతో తారకరత్న కోలుకోలేకపోయారు. చాలా రోజులు వెంటిలేటర్ పై చికిత్స అందించినా, విదేశాల నుంచి నిపుణులైన వైద్యులను రప్పించినా ఫలితం లేకపోయింది.