డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి సూపర్ ఓవర్.. యూపీని వరించిన విజయం!

- ఆర్‌సీబీ, యూపీ వారియర్స్ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్
- తొలుత ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు
- అనంతరం ఛేదనలో యూపీ కూడా 20 ఓవర్లలో 180 రన్స్‌కే ఆలౌట్
- మొదట సూపర్ ఓవర్‌లో యూపీ 8 రన్స్.. ఆ తర్వాత ఆర్‌సీబీ 4 రన్స్‌కే పరిమితం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో సంచలనం నమోదైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), యూపీ వారియర్స్ (యూపీడబ్ల్యూ) మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. తొలుత ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో యూపీ కూడా 20 ఓవర్లలో 180 రన్స్‌కే ఆలౌట్ అయింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 18 పరుగులు అవసరం కాగా 17 పరుగులే చేసింది. దీంతో టోర్నీ చరిత్రలో తొలిసారి సూపర్ ఓవర్ జరిగింది.
అయితే, సూపర్ ఓవర్‌లో యూపీ వారియర్స్ సూపర్ విక్టరీ సాధించింది. మొదట సూపర్ ఓవర్‌లో యూపీ 8 పరుగులు చేసింది. ఆ తర్వాత 9 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీని యూపీ 4 రన్స్‌కే కట్టడి చేసింది. ఆ జట్టు బౌలర్ సోఫీ ఎకిల్‌స్టన్ సూపర్ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.