Jaya Sudha: నా భర్త ఆత్మహత్యకి కారణం అదే: నటి జయసుధ

Jaya Sudha: నా భర్త ఆత్మహత్యకి కారణం అదే: నటి జయసుధ

BSR NEWS 

  • తన భర్త సూసైడ్ గురించి ప్రస్తావించిన జయసుధ
  • అప్పులు ఎంతమాత్రం కారణం కాదని వెల్లడి 
  • ఆ ఫ్యామిలీలో అలాంటి సంఘటనలు జరిగాయని వ్యాఖ్య
  • ఎవరికి తోచింది వాళ్లు రాస్తున్నారని అసహనం  

జయసుధ భర్త అప్పట్లో కొన్ని సినిమాలను నిర్మించారు. ఆ సినిమాల వలన నష్టాలు మాత్రమే మిగిలాయి. ఆ తరువాత కొంతకాలానికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. తాను నిర్మించిన సినిమాలు తెచ్చిపెట్టిన నష్టాల కారణంగానే ఆయన సూసైడ్ చేసుకున్నాడనే టాక్ వచ్చింది. తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ప్రశ్న జయసుధకు ఎదురైంది. 

అప్పుడు జయసుధ స్పందిస్తూ .. " మా వారు సూసైడ్ చేసుకోవడానికి కారణం అప్పులు .. ఆయన తీసిన సినిమాలు నష్టాలు తీసుకురావడమనే వార్తల్లో నిజం లేదు. అయినా ఆత్మహత్య చేసుకునేంత అప్పులు మాకు లేవు. సూసైడ్ చేసుకునే ఒక రకమైన మానసిక స్థితి మా పిల్లలకుగానీ ... వాళ్ల పిల్లలకు గాని రాకూడదనే నేను కోరుకుంటున్నాను. ఆత్మహత్య చేసుకోవడమనేది మా అత్తగారి ఫ్యామిలీ వైపు ఉంది. మా వారి అన్నయ్య .. మరో ఇద్దరు లేడీస్ ఇలాగే సూసైడ్ చేసుకుని చనిపోయారు" అని అన్నారు.

" సోషల్ మీడియా వచ్చిన తరువాత మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారమవుతోంది. ఎవరికి  తోచింది వాళ్లు రాస్తున్నారు. అలాంటి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఆయన చనిపోయిన తరువాత నేను ఆ షాక్ నుంచి బయటికి రావడానికి చాలా సమయం పట్టింది. మా ఫ్యామిలీ అంతా కూడా సపోర్టు చేయడం వలన .. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టడం వలన కోలుకోవడం జరిగింది" అని చెప్పారు.