కొత్త రియల్‌మి P3 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఖతర్నాక్ ఫీచర్లతో మొత్తం 4 మోడల్స్.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

కొత్త రియల్‌మి P3 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఖతర్నాక్ ఫీచర్లతో మొత్తం 4 మోడల్స్.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

కొత్త రియల్‌మి P3 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఖతర్నాక్ ఫీచర్లతో మొత్తం 4 మోడల్స్.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం

కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి సరికొత్త రియల్‌‌మి P3 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. రియల్‌మి కొత్త మోడళ్లలో రియల్‌మి P3 5G, P3x 5G, P3 Ultra, P3 Pro ఫోన్లను లాంచ్ చేయనుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ పరంగా జీటీ బూస్ట్ టెక్నాలజీతో ఫోన్లలో రానున్నాయి.

అన్ని వేరియంట్‌లు రియల్‌మి 2 సిరీస్‌ ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రియల్‌మి P3 ప్రో మోడల్ డ్యూయల్ కెమెరా, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. రియల్‌మి P3 ప్రో లాంచ్ తేదీ, ధర, స్పెసిఫికేషన్ల గురించి అంచనాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

లాంచ్ తేదీ, సమయం వివరాలివే :
రియల్‌మి రాబోయే P3 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తేదీని భారత మార్కెట్లో అధికారికంగా ధృవీకరించింది. రియల్‌మీ P3x 5G ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 12 గంటలకు హై-ఎండ్ రియల్‌మీ P3 ప్రోతో పాటు లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా ఇ-స్టోర్ ద్వారా నాలుగు ఫోన్లు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. 

రియల్‌మి P3x 5జీ సిరీస్ మొత్తం 3 అద్భుతమైన షేడ్స్‌లో లభిస్తుంది. లూనార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ స్టెల్లార్ పింక్ ఉన్నాయి. ఈ సిల్వర్ మోడల్ “స్టెల్లార్ ఐస్‌ఫీల్డ్ డిజైన్”ను కలిగి ఉంటుంది. మైక్రో-లెవల్ లైట్ ప్రత్యేకంగా ఉంటుందని అంచనా. బ్లూ, రోజ్ ఆప్షన్లు ప్రీమియం వీగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తాయి. ఈ హ్యాండ్‌సెట్ ఆకర్షణీయమైన ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. కేవలం 7.94mm మందం మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ ప్యానెల్‌లో మధ్యలో హోల్-పంచ్ కెమెరా, స్లిమ్ బెజెల్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఫోన్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో నిలువుగా డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

రియల్‌మి P3 Pro ప్రీమియం ఫీచర్లు :
రియల్‌మి P3x 5Gతో పాటు రియల్‌మి మరో 3 మోడల్స్ ప్రవేశపెట్టనుంది. ఈ సిరీస్ మోడల్స్ హై-ఎండ్ ఫీచర్లను కలిగి ఉంటాయి. రియల్‌‌మి ప్రో వేరియంట్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ ఏరోస్పేస్-గ్రేడ్ వీసీ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. రియల్‌మి P3 ప్రో మోడల్ స్పెషల్ ఫీచర్ కలిగి ఉంది. 6,000mAh బ్యాటరీతో పాటు స్పీడ్ రీఛార్జింగ్ కోసం 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.