రైలు ప్రమాదం: మృతుల్లో ఇద్దరు రైల్వే సిబ్బంది BSR NESW

రైలు ప్రమాదం: మృతుల్లో ఇద్దరు రైల్వే సిబ్బంది BSR NESW

        రైలు ప్రమాదం: మృతుల్లో ఇద్దరు రైల్వే సిబ్బంది

కంటకాపల్లి రైలు ప్రమాదంలో ఇద్దరు రైల్వే సిబ్బంది మృత్యువాత పడ్డారు. పలాస పాసెంజర్ రైలు గార్డుతో పాటు రాయగడ ట్రైన్ లోకో పైలట్ కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు. వీరితో కలిపి మృతుల సంఖ్య 8కి చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు, ప్రయాణికుల సంబంధీకుల నుంచి హెల్ప్ లైన్లకు భారీగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంటున్నారు. క్షతగాత్రుల సంఖ్య 100కు పైనే ఉండొచ్చని తెలుస్తోంది.