పూతలపట్టు అభ్యర్థులకు 'బాబు' భయం..! BSR NEWS

పూతలపట్టు అభ్యర్థులకు 'బాబు' భయం..!
చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు సెగ్మెంట్లో త్రిముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన MS బాబు కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆయనకే MLA టికెట్ లభించింది. సునీల్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా, మురళీమోహన్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నిన్నటి వరకు వీరిద్దరూ మెజార్టీపై లెక్కలు వేసుకోగా.. బాబు ఎంట్రీతో ఎవరి ఓట్లకు గండి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.