చిత్తూరు: బాంబు కొరకడంతో వ్యక్తి మృతి BSR NESW

చిత్తూరు: బాంబు కొరకడంతో వ్యక్తి మృతి జిల్లాలోని బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లెకుచెందిన చిరంజీవి సోమవారం రాత్రి మద్యం మత్తులో బాంబును నోటితో కొరికాడు. అది పేలడంతో అతను మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసైన చిరంజీవితో అతని భార్య గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో బాంబును కొరకడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టారు.