మాడ వీధుల్లో విహరించిన గణనాథుడు BSR NESW

మాడ వీధుల్లో విహరించిన గణనాథుడు
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం రాత్రి స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సంకటహర చతుర్థి వేడుకల అనంతరం స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ మోహన్ రెడ్డి, సర్పంచి శాంతి సాగర్ రెడ్డి, ఉపసర్పంచి విశ్వనాథరెడ్డి, ఆలయ ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.