ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో-పూతలపట్టు నియోజకవర్గంలో అధికారంలోకి రాబోయేది ఉమ్మడి కూటమి ప్రభుత్వమే......జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో BSR NEWS

ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో-పూతలపట్టునియోజకవర్గంలోఅధికారంలోకిరాబోయేదిఉమ్మడికూటమిప్రభుత్వమేజనసేననాయకులుఎంమహేష్స్వేరో
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండల పరిధిలోని వెంగంపల్లి గ్రామంలో పూతలపట్టు నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు లకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన నాయకులు,జనసైనికులు, వెంగంపల్లి యూత్. ఈ ప్రచారంలో పాల్గొన్న జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మరియు పూతలపట్టు నియోజకవర్గంలో అధికారంలోకి రాబోయేది ఉమ్మడి కూటమేనని, ఎక్కడికెళ్ళినా ప్రజలు ఉమ్మడి అభ్యర్థులను బాగా ఆదరిస్తున్నారని,గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ ప్రజలు విసిగిపోయారని,జగన్ మోహన్ రెడ్డి చెప్పే కల్లబొల్లి మాటలు ప్రజలను మోసం చేసే జాదు,మాయ చేసే మేనిఫెస్టోలను నమ్మే పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరని తప్పకుండా ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులు గెలిచి కూటమి అధికార స్థాపన చేస్తుందని తెలిపారు. నవరత్నాల పేరుతో ఎస్సీ కార్పొరేషన్ నిధులను దాదాపు 70 వేల కోట్లను నవరత్నాలకు మళ్లించి ఎస్సీలను మరింత దినస్థితికి చేర్చిన జగన్ మోహన్ రెడ్డికి దళితులందరూ తప్పకుండా గట్టిగా బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన పూతలపట్టు నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్,చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్,ఐరాల మండల అధ్యక్షులు పురుషోత్తం, తవణంపల్లి మండల అధ్యక్షులు శివ, స్వేరోస్ రాష్ట్ర నాయకులు వినోద్ కుమార్ స్వేరో మరియు జనసేన నాయకులు కిరణ్ కుమార్ స్వేరో,దినేష్,సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియు జనసేన యువ నాయకుడు విశ్వతేజ,దినేష్ కుమార్,కిరణ్ సంతోష్ మరియు వెంగంపల్లి యూత్ సుధా,రెడ్డప్ప,భాను,శేఖర్ తదితరులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.