ఐరాల: 'ఇంటింటికీ పథకాలను వెళ్లి వివరిస్తాం'BSR NESW

ఐరాల: 'ఇంటింటికీ పథకాలను వెళ్లి వివరిస్తాం'
ప్రజలకు చేసిన మేలును ఇంటింటికీ వెళ్లి వివరిస్తామని వైసీపీ ఐరాల మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ మోహన్, సచివాలయ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఐరాల మండల కేంద్రంలోని సచివాలయంలో 'ఏపీకి జగనే ఎందుకు కావాలంటే' కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే జగన్ని మరోసారి సీఎం చేస్తాయన్నారు. సర్పంచులు శాంతి సాగర్ రెడ్డి, గుణవతి పురుషోత్తం పాల్గొన్నారు.