దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపు

దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపు
  • దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందన్న రేవంత్ రెడ్డి
  • కేంద్రం చేతిలోనే అన్నీ ఉండాలని మోదీ కోరుకుంటున్నారని వ్యాఖ్య 
  • దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వడం లేదని విమర్శ 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల హక్కుల రక్షణకు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో తప్పనిసరైతే తాను చొరవ తీసుకుంటానని రేవంత్ పేర్కొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఓ పత్రిక నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.