న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ సంస్థ యూట్యూబ్ కొత్త సీఈవోగా ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న సుశాన్ వొజిస్కీ.. తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్టు గురువారం బ్లాగ్‌పోస్టులో వెల్లడించారు. ఇకపై వ్యక్తిగత జీవితంపై దృష్టిసారించనున్నట్టు చెప్పారు. 2014లో ఆమె సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కాగా, నీల్ మోహన్ ప్రస్తుతం యూట్యూబ్‌లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.