పెళ్ళి మండపంలో పేలిన గ్యాస్...

పెళ్ళి మండపంలో పేలిన గ్యాస్...

పెళ్లి వేడుకలో పేలిన గ్యాస్ సిలిండర్

కొన్ని గంటల్లో పెళ్లి జరగబోతుంది పెళ్లి వారందరూ కళ్యాణమండపంలో సందడిగా గడుపుతున్నారు. ఒకేసారి గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో కళ్యాణ మండపంలో మంటలు భారీగా వ్యాపించాయి.

మంటలను చూసి పెళ్లి వారందరూ ఎవరికి వారే పెళ్లి మండపం నుంచి పరుగులు తీశారు.

ఈ ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి గ్రామ శివారులోని సూర్య గార్డెన్ లో చోటు చేసుకుంది. శుక్రవారం రోజు ఈ పెళ్లి తంతు జరిగేది ఉండగా ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని పెళ్లికి హాజరైన బంధువులు అంటున్నారు.

 పెళ్లివారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది వచ్చిమంటలు ఆర్పడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు..