డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్‌: డిగ్రీ వరకు చదివిన తనకు ఉద్యోగం రావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువతి జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో జరిగింది. గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ ధర్మారంలో ఊదరి రవికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరికి వివాహమైంది. చిన్న కూతురు మేఘన (23) డిగ్రీ వరకు చదవి ఇంటివద్దే ఉంటోంది. ఉదయం 11 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఇన్‌స్పెక్టర్‌ సట్ల రాజు తెలిపారు. ‘డిగ్రీ వరకు చదివినా ఆర్థికంగా నా కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్నా. నన్ను తల్లిదండ్రులు బాగా చూసుకున్నారు. నా తండ్రి మద్యం తాగడం బంద్‌ చేసి ఆరేళ్ల నుంచి బాగానే చూసుకుంటున్నాడు. నాకు జాబ్‌ రావడం లేదనే ఒత్తిడికి గురవుతున్నా. అందరూ జాబ్‌ కోసం ట్రై చేసి రిజల్ట్‌ వచ్చిన తర్వాత ఓడిపోతారని, కానీ నేను ప్రయత్నం చేయకుండానే ఓడిపోతున్నా. ఐ మిస్‌యూ అమ్మానాన్న.. సిస్టర్స్, కుటుంబ సభ్యులు బాగుండాలి’అని తన డైరీలో రాసుకుని ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు. పోలీసులు ఆ డైరీని స్వాధీనం చేసుకున్నారు.

సమస్యలకు పరిష్కారం మరణం కాదు, సమస్యకు పరిష్కార మార్గం, మోటివేషన్.

సమస్యలు వున్నప్పుడు మోటివేషన్ కోసం కాల్ చేయండి: 8555947028 SADIQ SOFT SKILLS