నీట్-2023
*NEET-UG 2023: మార్చి 1 నుంచి నీట్ రిజిస్ట్రేషన్.. అర్హత, సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్ వివరాలివే!..... మరింత స్పష్టమైన అవగాహన కోసం సంప్రదించండి : 9494524363, 6281146058* *COURSES : MBBS, BDS, BVSC, BAMS, BHMS, BUMS, BSMS, BNYS &B.SC NURSING* *NEET-UG 2023: జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్-2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏర్పాట్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిమగ్నమైంది.* *వైద్య విద్య కలను సాకారం చేసుకోవడంలో కీలకమైన అడుగు నీట్ (NEET)లో అర్హత సాధించడం. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం అర్హత పరీక్షగా నీట్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కఠినమైన ఎగ్జామ్లలో ఒకటిగా భావించే నీట్ ప్రిపరేషన్లో విద్యార్థులు నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ ఏడాది నీట్ రిజిస్ట్రేషన్ డేట్, ఎగ్జామ్ తేదీ వంటి వివరాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందిగ్ధానికి త్వరలోనే తెరపడే అవకాశం ఉంది. జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్-2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏర్పాట్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిమగ్నమైంది. నీట్ లేటెస్ట్ అప్డేట్స్ అధికారిక పోర్టల్ neet.nta.nic.in ద్వారా ఎన్టీఏ వెల్లడించనుంది.* *అర్హత ప్రమాణాలు* *నీట్-2023 కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 17 ఏళ్లు నిండి ఉండాలి. అభ్యర్థులు ఇంటర్ పాసై ఉండాలి. ఇంటర్లో తప్పనిసరిగా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్ ప్రధాన సబ్జెక్టులుగా ఉండాలి. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.* *ఎగ్జామ్ ప్యాట్రన్* *నీట్ ప్రశ్నాపత్రం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. ఎగ్జామ్‌లో మొత్తంగా 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో మూడు సెక్షన్స్ ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మొత్తం 720 మార్కులకు ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కులు ఉంటాయి.* *సిలబస్* *నీట్ సిలబస్ ఇంటర్మీడిట్(గ్రేడ్ 12)పరీక్ష సిలబస్‌కు అనుగుణంగా ఉంటుంది. గ్రేడ్ 11, గ్రేడ్ 12కు సంబంధించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లోని టాఫిక్స్పై ప్రధానంగా అభ్యర్థులు దృష్టిసారించాల్సి ఉంటుంది.* *కనీస ఉత్తీర్ణత మార్కులు* *మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో కనీస ఉత్తీర్ణత మార్కులుగా అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 50 పర్సంటైల్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు 45 పర్సంటైల్... ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 40 శాతం స్కోర్ చేయాల్సి ఉంటుంది.* *ఏడాదికి ఒకసారి మాత్రమే* *నీట్-2023 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు. కాగా, నీట్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారని ఇటీవల ఊహాగాలు ఊపందుకోవడంతో ఎన్టీఏ స్పందించింది. నీట్ పరీక్షను ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేసింది.* *ఇన్ఫర్మేషన్ బులిటెన్‌లో వివరాలు* *నీట్ యూజీ అప్లికేషన్ ఫీజు, అడ్మిట్ కార్డ్ వివరాలను ఇన్ఫర్మేషన్ బులిటెన్‌లో ఎన్టీఏ వెల్లడించనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశం కోసం సంబంధిత నియంత్రణ సంస్థలు నోటిఫై చేసిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం నీట్ యూజీ పరీక్షను NTA చేపట్టనుంది. కాగా, నీట్-2023 పరీక్ష మే7వ తేదీన దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఏర్పాటు చేసే ఎగ్జామ్ సెంటర్లలో జరగనుంది.*
neet.nta.nic.in