చిత్తూరు: నేటి నుంచి రేషన్ పంపిణీ BSR NESW

చిత్తూరు: నేటి నుంచి రేషన్ పంపిణీ BSR NESW

                చిత్తూరు: నేటి నుంచి రేషన్ పంపిణీ

జిల్లాలో బుధవారం నుంచి రేషన్ పంపిణీ చేయనున్నట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. ఈ నెలకు సంబంధించి ప్రభుత్వం 1,339 చౌకదుకాణాల పరిధిలోని 5,31,019 కార్డులకు 15 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించింది. కందిపప్పు, గోధుమ పిండి, చక్కెర, రాగులు అవసరమైన మేరకు సరఫరా చేశారు. కార్డుదారులు రేషన్ పంపిణీ వాహనాల ద్వారా ఇంటి వద్దే సరుకులు పొందవచ్చని పేర్కొన్నారు.