చిత్తూరులో ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా. BSR NESW

చిత్తూరులో ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
నెల్లూరులో జిల్లా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ చిత్తూరు వన్ డిపో వద్ద డ్రైవర్స్, కండక్టర్ అసోసియేషన్ నాయకులు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ.. పార్టీల పేరు చెప్పుకొని కొంతమంది రౌడీ మూకలు తమ సిబ్బందిపై దాడి చేయడం అన్యాయమన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.