చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ గెలుపు పిలుపు వినిపిస్తుందని, అభివృద్ధి కోసం పులివర్తి నాని కావాలని చూస్తోందని ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు BSR NEWS

చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ గెలుపు పిలుపు వినిపిస్తుందని, అభివృద్ధి కోసం పులివర్తి నాని కావాలని చూస్తోందని ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు BSR NEWS

               చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ గెలుపుపి

లుపు వినిపిస్తుందని, అభివృద్ధి కోసం పులివర్తినాని కావాలని చూస్తోందని ఎమ్మెల్యే అభ్యర్థిపులివర్తి నాని సతీమణి                                    పులివర్తిసుధారెడ్డిఅన్నారు

. మంగళవారం తిరుపతి రూరల్ మండలం,పేరూరు పంచాయితీలో మహిళలతో కలిసి మహిళాశక్తికి అండగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులివర్తి సుధారెడ్డిహాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన,బిజెపి నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.స్థానిక మహిళలు పలు సమస్యల్ని ఆమె దృష్టికితీసుకువచ్చారు.పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే చెవిరెడ్డి పాలనలో చంద్రగిరి అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. 4 పదవులు, సీఎం కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసారని ఆవేదన వ్యక్తం చేశారు. సహజ సంపదను కొల్లగొట్టి, మఠం భూములు మాయం చేసి ఓటమి భయంతో ఒంగోలుకు మకాం మార్చారన్నారు. పాలనలో ముఖ్యమైన జెడ్పీటీసీలు , సర్పంచులు, ఎంపీటీసీలు వార్డు మెంబెర్స్ కూడా దూరం పెట్టి అరాచక పాలన కొనసాగించారన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో సమస్యలు తిష్ట వేశాయని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కోక్క సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో పులివర్తి నానిని గెలిపించాలని కోరారు.