కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. BSR NEWS

కాణిపాకంలో భక్తుల రద్దీ
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. శనివారం, ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లు అన్ని నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో పెంచల కిశోర్ పర్యవేక్షించారు. దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.