ఐరాల: ఉత్తమ ఏపీవోగా సంధ్యారాణి BSR NEWS

ఐరాల: ఉత్తమ ఏపీవోగా సంధ్యారాణి
ఐరాల మండల ఉపాధి హామీ పథకం ఏపీఓ సంధ్యారాణి ఉత్తమ అధికారిణిగా చిత్తూరు కలెక్టర్ సగిలి షన్మోహన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2024 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉపాధి పథకంలో అందించిన సేవలకు ఫలితంగా అవార్డు ఇచ్చారు. ఆమెకు అవార్డు రావడంపై మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, అభినందనలు తెలిపారు.