నగరిలో రోజా ఓడిపోతుంది: షర్మిల BSR NEWS

నగరిలో రోజా ఓడిపోతుంది: షర్మిల
జబర్దస్త్ రోజా ఇంట్లో నలుగురు మంత్రులు ఉన్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. పుత్తూరులో నిన్న రాత్రి జరిగిన న్యాయ యాత్రలో ఆమె మాట్లాడారు. 'రోజా, ఆమె భర్త, ఇద్దరు అన్నలు కలిసి భూములు కబ్జా చేశారు. ఇసుక దోచుకున్నారు. రోజమ్మ నగరి కోసం ఏ ఒక్క రోజూ పని చేయలేదు. ఇసుక, మట్టితో దోచుకున్న డబ్బులే ఆమె మీకు ఇస్తోంది. రానున్న ఎన్నికల్లో ఆమె ఓడిపోతుంది' అని షర్మిల జోస్యం చెప్పారు.