జనసేన విజయ యాత్ర - AP NEEDS PAWAN KALYAN* Day 60 BSR NEWS

జనసేన విజయ యాత్ర - AP NEEDS PAWAN KALYAN* Day 60 BSR NEWS

*జనసేన విజయ యాత్ర - AP NEEDS PAWAN KALYAN*                                            Day 60*

వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం* లో భాగంగా *ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం, బహదూర్ పేట లో నాయకులు నక్కా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు.పెద్ద ఎత్తున వినుత గారికి జనసైనికులు పూల వర్షంతో స్వాగతం పలికారు.పట్టణంలో ప్రచారం నిర్వహించి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీ ని, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలని, నియోజకవర్గంలో శ్రీమతి వినుత కోటా గారిని ఆశీర్వదించి, గాజు గ్లాసు గుర్తు కి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది. మార్పు కోసం జనసేన పార్టీ కి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది.పలు సమస్యలు వినుత గారి దృష్టికి ప్రజలు తెలిపారు, ముఖ్యంగా రాత్రి వేళల్లో మద్యం బాబులు, గంజాయి మత్తులో మహిళలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నట్టు తెలిపారు. డ్రైనేజ్ కాలువల సమస్య, స్ట్రీట్ లైట్లు సమస్యలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ ఇంఛార్జి తోట గణేష్, నాయకులు నక్కా ప్రసాద్, రఫీ , అఖిల్ సాయి, సుబ్బు, మునీంద్ర , ఉపాధ్యక్షులు రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ , మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, కవిత, లక్ష్మి, రాజ్య లక్ష్మి , పుష్ప , శారద ,దుర్గ, పేట చంద్ర శేఖర్, రాజేష్, సురేష్ , హేమంత్ , ఉదయ్ , చిన్న మునయ్య , వంశీ , నితీష్, వినోద్ , జనసైనికులు దినేష్ , మదు , బాలాజీ , మోహిత్ , తదితరులు పాల్గొన్నారు.