MLC ఓటు ఎలా వేయాలి ....??

MLC ఓటు ఎలా వేయాలి ....??

MLC ఓటు ఎలా వేయాలి..??

శాసన మండలి ఎన్నికల్లో పార్టీలపేర్లు, గుర్తులు వుండవు. అభ్యర్థుల పేర్లు, ఫోటోలుమాతమ్రే బ్యాలెట్ పేపరుపై వుంటాయి. ఎలక్ట్రానిక్ మిషన్లు కూడా ఉండవు

మనకు అందరికంటే ఎక్కువ ఇష్టం వున్న అభ్యర్థి ఎదురుగా 1 అని అంకె వెయ్యాలి. ఆ తర్వాత ఇష్టం వున్నవారికి 2,3,4 ఇలా ప్రాధాన్యతను ఇస్తూ పోవాలి. ఎంత మంది అభ్యర్థులుంటే అందరికీ అలా వెయ్యవచ్చు.మొదటి ప్రాధాన్యత ఓటు తప్పక వెయ్యాలి. ఆ తర్వాత ఎందరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలనేది మన ఇష్టం. కొందరికి ఓటు వేసి కొందరిని వదిలెయ్యవచ్చు కూడా.1,2,3,4 ఇలా అంకెలు మాత్రమే వెయ్యాలి. 'ఒకటి. 'రెండు' ఇలా రాయడం, గుర్తుపెట్టడం, ఇతర గుర్తులు పెట్టడం చెయ్యరాదు. అలా చేసినవి చెల్లుబాటు కావు. వేలిముద్రలు కూడా చెల్లవు.మొదటి ఓటు ఎవ్వరికీ వెయ్యకుండా 2.3 ఇలా ఇతరులకు వేసినా ఆ ఓటు చెల్లదు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ మాత్రమే వాడాలి.ఓటు అభ్యర్థికి రెండు ప్రాధాన్యతలు ఇవ్వరాదు.మొదటి ఓటు ఒకరికి వేసి ఇతరులకు 2.3 ప్రాధాన్యతలు ఇచ్చినందువల్ల మొదటి ఓటు పొందిన అభ్యర్థికి ఏమీ నష్టం రాదు. వీలున్నంత మందికి ఓటు వెయ్యిడం ఓటరు హక్కు కూడా. దీన్ని పొగొట్టుకోవద్దు.ఈ ఎన్నికల్లో ఎవరు ఎవరికి ఓటే వేసింది కనుక్కోవడం అసాధ్యం. మూడు జిల్లాల ఓట్లు కలబోసి ఆ తర్వాత మాత్రమే లెక్కిస్తారు.