చిత్తూరు జిల్లాలో 101 కేసులు నమోదు: SP. BSR NEWS

చిత్తూరు జిల్లాలో 101 కేసులు నమోదు: SP
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 101 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ మణికంఠ శుక్రవారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేశామన్నారు. పట్టుబడిన వారికి రూ.27,295 జరిమానా విధించినట్లు ఆయన పేర్కొన్నారు.