ఐరాల: 'మరోసారి జగన్ ను సీఎం చేసుకుందాం'BSR NESW

ఐరాల: 'మరోసారి జగన్ ను సీఎం చేసుకుందాం'
మరోసారి జగన్ను సీఎం చేసుకుందామని వైసీపీ ఐరాల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. పుల్లూరు పంచాయతీలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల కరపత్రాలు పంచిపెట్టారు. 2024 ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని కోరారు. సచివాలయ కన్వీనర్ ప్రతాపరెడ్డి, సర్పంచ్ మునిరత్నం, నాయకులు హరి, లోకనాథ్ రెడ్డి, జ్యోతి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.