పవన్తో BJP నేతల భేటీ BSR NESW

పవన్తో BJP నేతల భేటీ
TS: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పవన్ నివాసానికి వెళ్లి చర్చలు జరుపుతున్నారు. వీరు సీట్ల సర్దుబాటు గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. జనసేనకు ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలో చర్చించనున్నారు. తమకు హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో 33 సీట్లు కేటాయించాలని జనసేన మొదటి నుంచి బీజేపీని కోరుతోంది.